Saturday, 15 August 2026
  • Home  
  • మత్తుకు బానిసైతే భవిష్యత్తు అంధకారమే-ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ లావణ్య
- తిరుపతి

మత్తుకు బానిసైతే భవిష్యత్తు అంధకారమే-ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ లావణ్య

శ్రీ కాళహస్తి, ఆగస్టు 14, (పున్నమి న్యూస్): విద్యార్థులు, యువత డ్రగ్స్, పొగాకు, మద్యం వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తుకు బానిసైతే భవిష్యత్తు చీకటిమయమవుతుందని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఐ. లావణ్య పిలుపునిచ్చారు. శుక్రవారం శ్రీకాళహస్తిలోని ఎస్వీఏ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సహకారంతో, కళాశాల ఈగల్ క్లబ్, నషా ముక్త్ క్లబ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన ఇన్‌స్పెక్టర్ లావణ్య మాట్లాడుతూ.. యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా రక్షించుకున్నప్పుడే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్.బి. వాణిశ్రీ మాట్లాడుతూ.. ఒక్క వ్యక్తి మత్తు పదార్థాలకు బానిసైనా ఆ ప్రభావం కుటుంబం మొత్తంపై పడుతుందని, సమాజంలో నేరాలు పెరిగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, ఉన్నతమైన జీవితాన్ని నిర్మించుకోవాలని సూచించారు. అనంతరం ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు భాస్కర్, నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలను వాడినా, రవాణా చేసినా, ఇతరులను ప్రోత్సహించినా చట్టరీత్యా కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఈగల్ క్లబ్ కన్వీనర్ డాక్టర్ సి. నాగేశ్వర్ రెడ్డి విద్యార్థుల చేత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ మన్యం నరసింహులు, డాక్టర్ టి. గంగారాం, నషా ముక్త్ క్లబ్ కన్వీనర్ డాక్టర్ మునయ్య, ఎక్సైజ్ సిబ్బంది మునికన్నన్, త్రిపుర, వెంకటసుబ్బయ్య, విజయభాస్కర్, కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.