Saturday, 15 August 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన తనిఖీలు-ముగ్గురి గుర్తింపు
- తిరుపతి

శ్రీకాళహస్తిలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన తనిఖీలు-ముగ్గురి గుర్తింపు

శ్రీ కాళహస్తి, ఆగస్టు 14, (పున్నమి న్యూస్): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా శ్రీకాళహస్తిలోని వస్త్ర దుకాణాలు, హోటళ్లు, వాణిజ్య సంస్థల్లో అధికారులు శుక్రవారం విస్తృత తనిఖీలు చేపట్టారు. లేబర్ ఆఫీసర్ శ్రీమన్నారాయణ నాయకత్వంలో కార్మిక శాఖ, ప్రగతి స్వచ్ఛంద సంస్థ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం (DCPU) ప్రతినిధులు ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ పరిశీలనలో 15 నుంచి 18 ఏళ్ల వయస్సు గల ముగ్గురు బాల కార్మికులను గుర్తించి, యజమానులపై ఇన్‌స్పెక్షన్ రిపోర్టులు నమోదు చేశారు. విచారణ అనంతరం వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు లేబర్ ఆఫీసర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 ఏళ్ల లోపు పిల్లలను పనుల్లో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘించే యజమానులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గుర్తించిన బాలలకు విద్య, పునరావాసం మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ముని, ప్రగతి సంస్థ ప్రతినిధులు ప్రభాకర్, చంద్రశేఖర్, రామచంద్ర, DCPU సిబ్బంది కల్పన, సిసింద్రీ, మోహన్ బాబు, గంధం లత తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.