Tuesday, 26 May 2026
  • Home  
  • డాక్టర్ కే. లక్ష్మణ్‌కు కీలక బాధ్యత… రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్‌గా నియామకం
- హైదరాబాద్

డాక్టర్ కే. లక్ష్మణ్‌కు కీలక బాధ్యత… రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్‌గా నియామకం

న్యూఢిల్లీ, మే భారతీయ జనతా పార్టీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు కే. లక్ష్మణ్ కి కేంద్ర స్థాయి లో మరో కీలక బాధ్యత లభించింది. రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్‌గా ఆయనను నియమించారు. పార్లమెంట్ సభ్యులకు నివాస సౌకర్యాలు, వసతుల నిర్వహణ, సంబంధిత పరిపాలనా అంశాల పర్యవేక్షణ బాధ్యతలను హౌస్ కమిటీ నిర్వహిస్తుంది. ఈ కీలక కమిటీకి చైర్మన్‌గా డాక్టర్ కే. లక్ష్మణ్ నియామకం కావడం పట్ల బీజేపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘకాలంగా పార్టీ సంస్థాగత బలోపేతం, ఓబీసీ వర్గాల సాధికారత కోసం కృషి చేస్తున్న డాక్టర్ కే. లక్ష్మణ్‌కు ఈ బాధ్యత దక్కడం ఆయన నాయకత్వానికి గుర్తింపుగా భావిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

న్యూఢిల్లీ, మే

భారతీయ జనతా పార్టీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు కే. లక్ష్మణ్ కి కేంద్ర స్థాయి లో మరో కీలక బాధ్యత లభించింది. రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్‌గా ఆయనను నియమించారు.

పార్లమెంట్ సభ్యులకు నివాస సౌకర్యాలు, వసతుల నిర్వహణ, సంబంధిత పరిపాలనా అంశాల పర్యవేక్షణ బాధ్యతలను హౌస్ కమిటీ నిర్వహిస్తుంది. ఈ కీలక కమిటీకి చైర్మన్‌గా డాక్టర్ కే. లక్ష్మణ్ నియామకం కావడం పట్ల బీజేపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సుదీర్ఘకాలంగా పార్టీ సంస్థాగత బలోపేతం, ఓబీసీ వర్గాల సాధికారత కోసం కృషి చేస్తున్న డాక్టర్ కే. లక్ష్మణ్‌కు ఈ బాధ్యత దక్కడం ఆయన నాయకత్వానికి గుర్తింపుగా భావిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.