జి.శంకరయ్య,
పిఎస్ హెచ్ఎం,కు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
———————————
ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న గైని శంకరయ్య పి ఎస్ హెచ్ ఎం, ను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, స్టేషన్ ఘనపూర్ శాసన సభ్యులు కడియం శ్రీహరి చేతుల మీదుగా ఘనంగా సన్మానం పొందడం జరిగింది అని శంకరయ్య తెలిపారు.ఈ సందర్బంగా శంకరయ్య మాట్లాడుతూ వృత్తి పట్ల నిబద్దత, అంకిత భావం, క్రమశిక్షణ తో విద్యార్థులకు విలువలతో కూడిన విద్య ను అందచేస్తూ, ఎం పి పి ఎస్ కోలుకొండ
పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి తల్లి దండ్రులను ఒప్పించి చదువు నేర్పడానికి అహర్నిశలు శ్రమిస్తామని తెలిపారు. శంకరయ్య కు జిల్లా ఉత్తమ అవార్డు రావడం పట్ల ఉపాధ్యాయులు,అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్, కమిటీ సభ్యులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు


