40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఏటా గుండె ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి
అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరులో ₹3,999కే ప్రత్యేక హార్ట్ కేర్ ప్యాకేజ్
మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్న వయస్సులోనే గుండె సంబంధిత సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రజల్లో గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్, నెల్లూరు ప్రత్యేక హార్ట్ కేర్ ప్యాకేజ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ సందర్భంగా శనివారం అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో జరిగిన పత్రికా విలేఖరుల సమావేశంలో ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ చిర్రా భక్తవత్సల రెడ్డి, గుండె వైద్య నిపుణులు డాక్టర్ షర్మిలీ, డాక్టర్ నాగభూషణం, CTVS సర్జన్ డాక్టర్ జై గణేశ్ మరియు అనస్థీసియా డాక్టర్ మధు లు మాట్లాడారు.
40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ తమ గుండె ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పరీక్షించుకోవడం ఎంతో ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. గ్యాస్ట్రిక్ సమస్యగా భావిస్తున్న నొప్పి నిజంగా గుండెకు సంబంధించినదా అనే విషయాన్ని నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సలహా తీసుకోవాలని సూచించారు.
ఈ ప్రత్యేక Dedicated Heart Care Packageను కేవలం ₹3,999కే అందిస్తున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ఈ ప్యాకేజీలో ECG, ECHO, Treadmill Test, RBS, Lipid Profileతో పాటు Senior Cardiologist Consultation కూడా ఉంటుంది.
అత్యవసర వైద్య అవసరాల కోసం 24×7 అత్యాధునిక కార్డియాక్ సేవలు అందుబాటులో ఉన్నాయని, కార్డియాక్ డిపార్ట్‌మెంట్‌లో పూర్తి స్థాయి వైద్య సదుపాయాలతో పాటు అనుభవజ్ఞులైన కార్డియాలజిస్టుల సేవలు అందిస్తున్నామని ఆసుపత్రి ప్రతినిధులు తెలిపారు.
“గుండె ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, ముందస్తు పరీక్షల ద్వారా గుండె సంబంధిత సమస్యలను గుర్తించడం ఎంతో అవసరం. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన వారు క్రమం తప్పకుండా హార్ట్ చెకప్ చేయించుకోవాలి” అని వైద్యులు సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆసుపత్రి డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, హాస్పిటల్ యూనిట్ హెడ్ విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ ప్రత్యేక ఆఫర్ 14 అక్టోబర్ 2026 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.
మరిన్ని వివరాలు మరియు అపాయింట్‌మెంట్ కోసం:
అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్, ముత్తుకూరు రోడ్, నెల్లూరు
📞 0861-666 7333 | 235 8333


