ఖానాపూర్ మండల
కొత్తూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కర్నె వెంకటేశ్వర్లు గారి తల్లి కీ.శే. నరసమ్మ గారు వృద్ధాప్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న నియోజకవర్గ నాయకులు ఆమె పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
నివాళులర్పించిన వారిలో నియోజకవర్గ నాయకులు రాయిడి రవీందర్ రెడ్డి గారు, మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు గారు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రామస్వామి నాయక్ గారుఉన్నారు.
ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ దాసరి రమేష్ గారు, మండల నాయకులు జాటోతు సదర్ లాల్, బూస అశోక్, జాటోతు బాలు నాయక్, గ్రామ పార్టీ అధ్యక్షులు రమేష్ నాయక్, మాజీ సర్పంచ్ పోతురాజు కట్టయ్య, సొసైటీ మాజీ డైరెక్టర్ సొంటి లక్ష్మణ్, పార్టీ నాయకులు పోతురాజు కుమారస్వామి, వార్డు సభ్యులు స్వప్న, రాము తదితరులు పాల్గొన్నారు.


