అనపర్తి, జూలై 22 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): అనపర్తి మండలం రామవరంలో నిర్వహించిన జాతీయ జెండా ఆమోద దినోత్సవం సందర్భంగా భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య చిత్రపటానికి అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, భారత జాతీయ పతాకాన్ని రూపకల్పన చేసి దేశానికి చిరస్మరణీయ సేవలందించిన పింగళి వెంకయ్య సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ప్రతి భారతీయుడు జాతీయ జెండాను గౌరవించడం, దేశభక్తి భావాన్ని పెంపొందించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని పింగళి వెంకయ్య చిత్రపటానికి నివాళులర్పించారు.



