Wednesday, 22 July 2026
  • Home  
  • జాతీయ జెండా ఆమోద దినోత్సవం సందర్భంగా పింగళి వెంకయ్యకు ఎమ్మెల్యే నల్లమిల్లి నివాళి
- తూర్పు గోదావరి

జాతీయ జెండా ఆమోద దినోత్సవం సందర్భంగా పింగళి వెంకయ్యకు ఎమ్మెల్యే నల్లమిల్లి నివాళి

అనపర్తి, జూలై 22 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): అనపర్తి మండలం రామవరంలో నిర్వహించిన జాతీయ జెండా ఆమోద దినోత్సవం సందర్భంగా భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య చిత్రపటానికి అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, భారత జాతీయ పతాకాన్ని రూపకల్పన చేసి దేశానికి చిరస్మరణీయ సేవలందించిన పింగళి వెంకయ్య సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ప్రతి భారతీయుడు జాతీయ జెండాను గౌరవించడం, దేశభక్తి భావాన్ని పెంపొందించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని పింగళి వెంకయ్య చిత్రపటానికి నివాళులర్పించారు.

అనపర్తి, జూలై 22 (రమేష్ నాయుడు  పున్నమి ప్రతినిధి): అనపర్తి మండలం రామవరంలో నిర్వహించిన జాతీయ జెండా ఆమోద దినోత్సవం సందర్భంగా భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య చిత్రపటానికి అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, భారత జాతీయ పతాకాన్ని రూపకల్పన చేసి దేశానికి చిరస్మరణీయ సేవలందించిన పింగళి వెంకయ్య సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ప్రతి భారతీయుడు జాతీయ జెండాను గౌరవించడం, దేశభక్తి భావాన్ని పెంపొందించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని పింగళి వెంకయ్య చిత్రపటానికి నివాళులర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.