Saturday, 8 August 2026
  • Home  
  • జవహర్ నవోదయ విద్యాలయం* వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ దండే విఠల్*
- News

జవహర్ నవోదయ విద్యాలయం* వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ దండే విఠల్*

*జవహర్ నవోదయ విద్యాలయం* *వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ దండే విఠల్* కాగజ్ నగర్ ఆగస్టు 5 కోమురం భీం జిల్లా కాగజ్ నగర్ లో నిర్వహించిన 39వ నవోదయ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు *ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ శ్రీ దండే విఠల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ విద్యార్థులను, ఉద్దేశించి ప్రసంగించారు, నవోదయ విద్యాలయాలు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను అలవర్చుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. కష్టపడి చదివి తమ తల్లిదండ్రులకు, పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం పాఠశాల యాజమాన్యం ఎమ్మెల్సీ శ్రీ దండే విఠల్ శాలువా, జ్ఞాపికతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

*జవహర్ నవోదయ విద్యాలయం* *వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ దండే విఠల్*

కాగజ్ నగర్ ఆగస్టు 5 కోమురం భీం జిల్లా కాగజ్ నగర్ లో నిర్వహించిన 39వ నవోదయ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు *ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ శ్రీ దండే విఠల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ విద్యార్థులను, ఉద్దేశించి ప్రసంగించారు,
నవోదయ విద్యాలయాలు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను అలవర్చుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. కష్టపడి చదివి తమ తల్లిదండ్రులకు, పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

అనంతరం పాఠశాల యాజమాన్యం ఎమ్మెల్సీ శ్రీ దండే విఠల్ శాలువా, జ్ఞాపికతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.