కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 23
*300 మంది మహిళలతో మారుమోగిన ఆర్యవైశ్య కళ్యాణ మండపం – భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహణ.. హాజరైన ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు, ఎమ్మార్వో జేవియర్ రమేష్, ఎలక్ట్రికల్ ఈఈ వీరభద్ర రావు స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో బుధవారం ఉదయం 8 గంటల నుండి విష్ణు సహస్రనామ పారాయణం నక్షత్రమాల – 27 కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.భక్తిశ్రద్ధలతో, శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో 300 మంది మహిళలచే 27 సార్లు విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. మొదలుపెట్టిన 300 మంది మహిళలు భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా చివరి వరకు 27 సార్లు పూర్తిగా పారాయణంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ పవిత్ర కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు ( కొండబాబు ) హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విశిష్ట అతిథులుగా జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు, ఎమ్మార్వో జేవియర్ రమేష్, ఎలక్ట్రికల్ ఈఈ వీరభద్రరావు, ఎంపీడీవో చంద్రశేఖర్ తదితరులు హాజరయ్యారు. వేద పండితులు, బ్రాహ్మణుల వేద మంత్రోచ్ఛారణ మధ్య కార్యక్రమం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.ఈ కార్యక్రమంలో మానేపల్లి బంగార్రాజు, కంచర్ల బాబు, వి నాగసత్య, బొండా వీర సత్య, బోండా నూకబాబు, దారా శ్రీనివాస్, మానేపల్లి వీర్రాజు గుప్తా, మహిళా సంఘం సభ్యులు కొత్త మాధురి రత్న ఆండాళ్, బోండా విజయ, మతంశెట్టి లావణ్య,మానేపల్లి రజిని,స్వాతి, ఇందిరా, రమాదేవి తదితరులు హాజరై పారాయణం నిర్వహించి ప్రజలందరూ సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రకృతి వైపరీత్యాలు తొలగిపోవాలని ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.


