Sunday, 16 August 2026
  • Home  
  • చోడవరపు రాజా జ్ఞాపకార్థం వృద్ధాశ్రమంలో అన్నదానం
- తూర్పు గోదావరి

చోడవరపు రాజా జ్ఞాపకార్థం వృద్ధాశ్రమంలో అన్నదానం

బిక్కవోలు, ఆగస్టు 14 (పున్నమి ప్రతినిధి): ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి బిక్కవోలు శాఖ ఆధ్వర్యంలో బిక్కవోలు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త చోడవరపు రాంబాబు, శ్రీమతి సత్యవతి దంపతుల కుమారుడు చిరంజీవి చోడవరపు రాజా జ్ఞాపకార్థం మల్లంపూడిలోని సాయిబాబా వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలోని సుమారు 100 మంది వృద్ధులకు భోజన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సేవా సమితి ప్రతినిధులు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల ద్వారా అవసరమైన వారికి అండగా నిలవడం తమ సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. చోడవరపు రాజా జ్ఞాపకార్థం వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించడం ద్వారా ఆయన జ్ఞాపకాలను సేవా కార్యక్రమాలతో చిరస్మరణీయంగా నిలిపే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చోడవరపు రాంబాబు, ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి ఎన్జీఓ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పెదపాటి విష్ణు, బిక్కవోలు శాఖ అధ్యక్షులు, రాష్ట్ర సేవా రత్న అవార్డు గ్రహీత (పిఎస్వీ), పున్నమి ప్రతినిధి సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు, శ్రీమతి మణికుమారి తదితరులు పాల్గొన్నారు.

బిక్కవోలు, ఆగస్టు 14 (పున్నమి ప్రతినిధి): ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి బిక్కవోలు శాఖ ఆధ్వర్యంలో బిక్కవోలు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త చోడవరపు రాంబాబు, శ్రీమతి సత్యవతి దంపతుల కుమారుడు చిరంజీవి చోడవరపు రాజా జ్ఞాపకార్థం మల్లంపూడిలోని సాయిబాబా వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలోని సుమారు 100 మంది వృద్ధులకు భోజన ఏర్పాట్లు చేశారు.

ఈ సందర్భంగా సేవా సమితి ప్రతినిధులు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల ద్వారా అవసరమైన వారికి అండగా నిలవడం తమ సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. చోడవరపు రాజా జ్ఞాపకార్థం వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించడం ద్వారా ఆయన జ్ఞాపకాలను సేవా కార్యక్రమాలతో చిరస్మరణీయంగా నిలిపే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో చోడవరపు రాంబాబు, ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి ఎన్జీఓ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పెదపాటి విష్ణు, బిక్కవోలు శాఖ అధ్యక్షులు, రాష్ట్ర సేవా రత్న అవార్డు గ్రహీత (పిఎస్వీ), పున్నమి ప్రతినిధి సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు, శ్రీమతి మణికుమారి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.