Tuesday, 8 September 2026
  • Home  
  • *చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో రావులపాలెంలో ఘనంగా వైఎస్సార్‌సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

*చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో రావులపాలెంలో ఘనంగా వైఎస్సార్‌సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం

*కోనసీమలో వైఎస్సార్‌సీపీకి కార్యకర్తలే వెన్నెముక – బొత్స సత్యనారాయణ* *స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులు సమరశంఖం పూరించాలి* *ప్రజా వ్యతిరేక కూటమి పాలనను ఎండగట్టేందుకు ‘వెన్నుపోటు పార్టీ.. వెన్నుపోటు పాలన’ కార్యక్రమం* డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో రావులపాలెం సీఆర్‌సీ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా శాసన మండలి ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే అసలైన బలం, బలగమని అన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, ప్రజలకు అండగా నిలుస్తున్న పార్టీ శ్రేణుల కృషిని అభినందించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్తపై ఉందని సూచించారు. ఈ సమావేశంలో అమలాపురం పార్లమెంటరీ పరిశీలకురాలు, పీఏసీ సభ్యులు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు, సీఈసీ సభ్యులు, రాష్ట్ర కార్యదర్శులు, ఎస్‌ఈసీ సభ్యులు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీలు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వివిధ పదవుల్లో ఉన్న ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల భారీ హాజరుతో రావులపాలెం సీఆర్‌సీ ప్రాంగణం పార్టీ శ్రేణుల నినాదాలతో సందడిగా మారింది. సమావేశం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.

*కోనసీమలో వైఎస్సార్‌సీపీకి కార్యకర్తలే వెన్నెముక – బొత్స సత్యనారాయణ*

*స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులు సమరశంఖం పూరించాలి*

*ప్రజా వ్యతిరేక కూటమి పాలనను ఎండగట్టేందుకు ‘వెన్నుపోటు పార్టీ.. వెన్నుపోటు పాలన’ కార్యక్రమం*

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో రావులపాలెం సీఆర్‌సీ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా శాసన మండలి ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే అసలైన బలం, బలగమని అన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, ప్రజలకు అండగా నిలుస్తున్న పార్టీ శ్రేణుల కృషిని అభినందించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్తపై ఉందని సూచించారు.

ఈ సమావేశంలో అమలాపురం పార్లమెంటరీ పరిశీలకురాలు, పీఏసీ సభ్యులు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు, సీఈసీ సభ్యులు, రాష్ట్ర కార్యదర్శులు, ఎస్‌ఈసీ సభ్యులు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీలు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వివిధ పదవుల్లో ఉన్న ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల భారీ హాజరుతో రావులపాలెం సీఆర్‌సీ ప్రాంగణం పార్టీ శ్రేణుల నినాదాలతో సందడిగా మారింది. సమావేశం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.