కొత్తగూడెం, జూలై
(పున్నమి న్యూస్ )
వైరా శాసనసభ్యులు మాలోత్ రామ్ దాస్ నాయక్ జన్మదిన వేడుకలు కొత్తగూడెంలోని సూపర్ బజార్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, ఎం.డి. రజాక్, బాలన్న తదితరులు పాల్గొని ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలోత్ రామ్ దాస్ నాయక్ ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తూ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.



