Wednesday, 9 September 2026
  • Home  
  • రెండవ రోజు కొనసాగుతున్న సప్త భజన
- నిజామాబాద్

రెండవ రోజు కొనసాగుతున్న సప్త భజన

వేల్పూర్.సప్త భజనలో రెండవ రోజు గురువారం అవధూత గోవిందగిరి దివ్య యోగాశ్రమంలో నందిపేట మండలంలోని ఐలాపూర్ గ్రామానికి చెందిన ఓంకారేశ్వర భజన మండలి బృందం సభ్యులు భజన పాటలు పాడుతూ “తల్లిదండ్రుల సేవ దొరుకునా, తల్లిదండ్రుల సేవ చేయడమే మహా పుణ్యము” కన్న తల్లిదండ్రులకు సపరిచర్యలు, జ్ఞానబోధ బోధించిన గురుదేవులకు… అంటూ చక్కటి గాత్రంతో చూపరులను, శ్రోతలను అలరింపజేశారు. భజన కళాకారులకు శ్రీ రాఘవేంద్ర స్వామి జ్ఞాపికల్ని బహుకరించారు.ఈ శుభ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ రాఘవేంద్ర స్వామి ప్రసంగిస్తూ భజనలకు మహత్తరమైన శక్తి ఉంది. కష్టాల్ని సైతం మైమరపింప జేసేవి భజనలు అని అన్నారు. శ్రీ గోవిందగిరి కళ్యాణ మండపంలో భక్తులు ఆనందంతో చక్కటి నృత్యాల్ని చేశారు. వేల్పూర్ కు చెందిన కూషన్నగారి శశికళ కుటుంబ సభ్యులు గురుపాదుకా పూజ నిర్వహించారు. భజనలతో ఆశ్రమ ప్రాంగణమంతా మార్మోగింది. భజనలకు ఉన్న శక్తి అపారమైనది. ఈ కార్యక్రమంలో సీతారాం పల్లెకు చెందిన శ్రీరామ భక్త భజన మండలి బృందం సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, సాయి సేవకులు, జిల్లాలోని అనేక గ్రామాలకు చెందిన భజన కళాకారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

వేల్పూర్.సప్త భజనలో రెండవ రోజు గురువారం అవధూత
గోవిందగిరి దివ్య యోగాశ్రమంలో నందిపేట మండలంలోని ఐలాపూర్ గ్రామానికి చెందిన ఓంకారేశ్వర భజన మండలి బృందం సభ్యులు భజన పాటలు పాడుతూ “తల్లిదండ్రుల సేవ దొరుకునా, తల్లిదండ్రుల సేవ చేయడమే మహా పుణ్యము” కన్న తల్లిదండ్రులకు సపరిచర్యలు, జ్ఞానబోధ బోధించిన గురుదేవులకు… అంటూ చక్కటి గాత్రంతో చూపరులను, శ్రోతలను అలరింపజేశారు. భజన కళాకారులకు శ్రీ రాఘవేంద్ర స్వామి జ్ఞాపికల్ని బహుకరించారు.ఈ శుభ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ రాఘవేంద్ర స్వామి ప్రసంగిస్తూ భజనలకు మహత్తరమైన శక్తి ఉంది. కష్టాల్ని సైతం
మైమరపింప జేసేవి భజనలు అని అన్నారు. శ్రీ గోవిందగిరి కళ్యాణ మండపంలో భక్తులు ఆనందంతో చక్కటి నృత్యాల్ని చేశారు. వేల్పూర్ కు చెందిన
కూషన్నగారి శశికళ కుటుంబ సభ్యులు గురుపాదుకా పూజ నిర్వహించారు. భజనలతో ఆశ్రమ ప్రాంగణమంతా మార్మోగింది. భజనలకు ఉన్న శక్తి అపారమైనది. ఈ కార్యక్రమంలో సీతారాం పల్లెకు చెందిన శ్రీరామ భక్త భజన మండలి బృందం సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, సాయి సేవకులు, జిల్లాలోని అనేక గ్రామాలకు చెందిన భజన కళాకారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.