Friday, 11 September 2026
  • Home  
  • ఘనంగా జేడీఆర్ఎఫ్ తూర్పుగోదావరి జిల్లా మహాసభ
- తూర్పు గోదావరి

ఘనంగా జేడీఆర్ఎఫ్ తూర్పుగోదావరి జిల్లా మహాసభ

మీడియా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి: ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం, సెప్టెంబరు 6 (పున్నమి ప్రతినిధి): రాజమహేంద్రవరం పోలీస్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం జేడీఆర్ఎఫ్ (జర్నలిస్ట్స్ డెమోక్రటిక్ రైట్స్ ఫోరం) తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా మహాసభ ఘనంగా జరిగింది. జేడీఆర్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మేడా శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మీడియా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో మీడియా మిత్రుల సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు. పాత్రికేయుల హక్కులను కాపాడటంతో పాటు వారి సంక్షేమానికి ప్రభుత్వం తరఫున తనవంతు సహకారం అందిస్తామని తెలిపారు. జర్నలిస్టులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు.

మీడియా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి: ఆదిరెడ్డి శ్రీనివాస్

రాజమహేంద్రవరం, సెప్టెంబరు 6 (పున్నమి ప్రతినిధి): రాజమహేంద్రవరం పోలీస్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం జేడీఆర్ఎఫ్ (జర్నలిస్ట్స్ డెమోక్రటిక్ రైట్స్ ఫోరం) తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా మహాసభ ఘనంగా జరిగింది. జేడీఆర్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మేడా శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మీడియా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో మీడియా మిత్రుల సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు. పాత్రికేయుల హక్కులను కాపాడటంతో పాటు వారి సంక్షేమానికి ప్రభుత్వం తరఫున తనవంతు సహకారం అందిస్తామని తెలిపారు. జర్నలిస్టులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.