ఆగష్టు-12, అరకులోయ(పున్నమి ప్రతినిధి): అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలల్లో జాతీయ గ్రంథపాలకుల దినోత్సవం ఘనంగా జరిపారు. డా ఎస్ ఆర్ రంగనాథన్ జన్నదినాన్ని జాతీయ గ్రంథపాలకుల దినోత్సవంగా జరుపుకుంటారని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.కేశవరావు, మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా కుసుమకుమారి అన్నారు. ఈ సందర్బంగా పుస్తక ప్రదర్శన చేపట్టారు. గ్రంథాలయం యొక్క ఉపయోగాలను లైబ్రేరియన్స్ నిర్మల, మోహన్ లు వరించారు. పోటీ పరీక్షలకు గ్రంథాలయాలు ఉపయోగపడతాయి కావు విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు.



