ఆమంచర్ల వద్ద భూమిని పారిశ్రామిక అభివృద్ధి కోసం వినియోగించడం లో సహకరించాలని చేతులు పట్టుకుని బ్రతిమాలేందుకైనా వెనుకాడనని, నెల్లూరు అభివృద్ధి కోసమే తన ఈ ఆరాటం ఆవేదన అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. దిశ సమావేశంలో అధికారులను గ్లాస్ తయారీ పరిశ్రమను నెలకొల్పే విషయంలో చొరవ తీసుకోవాలని వేడుకున్న వైనం సభలో పలువురిని ఉద్వేగం కు గురి చేసింది.
ఆమంచర్ల గ్రామం వద్ద పారిశ్రామిక అవసరాల కోసం గతంలో 500 ఎకరాల భూమిని కేటాయించారని, రైతులందరికీ రూ. 50 కోట్ల నష్టపరిహారం కూడా చెల్లించామని ఆయన గుర్తుచేశారు
కానీ పరిహారం చెల్లించిన తర్వాత ఆ భూమి తమదేనంటూ అటవీ శాఖ అధికారులు బోర్డులు పెట్టడంతో ప్రాజెక్టు ఆగిపోయిందని శ్రీధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి, ఈ భూమిని పరిశ్రమకు అప్పగించాలని లేదా ప్రత్యామ్నాయ భూమిని చూపించాలని శ్రీ ధర్ చేతులు జోడించి మరీ కోరారు.
ఈ గ్లాస్ పరిశ్రమతో వేల మందికి ఉపాధి లభిస్తుందని జిల్లాలో దశ, దిశ మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు
ఇదే కాకుండా, స్థానిక టిడ్కో కాలనీ వాసుల కోసం సుమారు రూ. 60 లక్షల ఖర్చుతోో 200
మీటర్ రోడ్డును నిర్మించాలని కోరారు. దిశ సభలో శ్రీధర్ రెడ్డి అభివృద్ధిని కాంక్షిస్తూ చేసిన అభ్యర్ధన అధికారుల ఇతర నేతలలో చర్చనీయాంశమైంది.

గ్లాస్ పరిశ్రమ ఏర్పాటు కి సహకరించాలి అభివృద్ధి కోసం కోటంరెడ్డి అభ్యర్ధన
ఆమంచర్ల వద్ద భూమిని పారిశ్రామిక అభివృద్ధి కోసం వినియోగించడం లో సహకరించాలని చేతులు పట్టుకుని బ్రతిమాలేందుకైనా వెనుకాడనని, నెల్లూరు అభివృద్ధి కోసమే తన ఈ ఆరాటం ఆవేదన అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. దిశ సమావేశంలో అధికారులను గ్లాస్ తయారీ పరిశ్రమను నెలకొల్పే విషయంలో చొరవ తీసుకోవాలని వేడుకున్న వైనం సభలో పలువురిని ఉద్వేగం కు గురి చేసింది. ఆమంచర్ల గ్రామం వద్ద పారిశ్రామిక అవసరాల కోసం గతంలో 500 ఎకరాల భూమిని కేటాయించారని, రైతులందరికీ రూ. 50 కోట్ల నష్టపరిహారం కూడా చెల్లించామని ఆయన గుర్తుచేశారు కానీ పరిహారం చెల్లించిన తర్వాత ఆ భూమి తమదేనంటూ అటవీ శాఖ అధికారులు బోర్డులు పెట్టడంతో ప్రాజెక్టు ఆగిపోయిందని శ్రీధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి, ఈ భూమిని పరిశ్రమకు అప్పగించాలని లేదా ప్రత్యామ్నాయ భూమిని చూపించాలని శ్రీ ధర్ చేతులు జోడించి మరీ కోరారు. ఈ గ్లాస్ పరిశ్రమతో వేల మందికి ఉపాధి లభిస్తుందని జిల్లాలో దశ, దిశ మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు ఇదే కాకుండా, స్థానిక టిడ్కో కాలనీ వాసుల కోసం సుమారు రూ. 60 లక్షల ఖర్చుతోో 200 మీటర్ రోడ్డును నిర్మించాలని కోరారు. దిశ సభలో శ్రీధర్ రెడ్డి అభివృద్ధిని కాంక్షిస్తూ చేసిన అభ్యర్ధన అధికారుల ఇతర నేతలలో చర్చనీయాంశమైంది.

