ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సమాచార హక్కు రక్షణ చట్టం–2005 సొసైటీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ హరిత గారిని మర్యాదపూర్వకంగా కలిసి సమాచార హక్కు చట్టం బలోపేతం కొరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా,, కొండగుర్ల కమలాకర్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం జిల్లా మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో (గ్రామపంచాయతీ స్థాయి వరకు) సమాచార బోర్డులు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే సమాచార హక్కు చట్టం సెక్షన్ 4(1)(బి) ప్రకారం స్వచ్ఛందంగా వెల్లడించాల్సిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని, సెక్షన్ 26 ప్రకారం ప్రజలకు శాఖాపరమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ముఖ్యంగా సమాచార హక్కు చట్టం దరఖాస్తుదారులు, కార్యకర్తల రక్షణకు సంబంధించిన మెమో నం. 33086ను సమర్థవంతంగా అమలు చేయాలని విన్నవించారు. దరఖాస్తుదారుల వివరాలు బహిర్గతం కాకుండా చూడాలని, వారికి చట్టప్రకారం గడువులోపు సమాచారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో నిర్వహించే ఆర్‌టిఐ కార్యక్రమాల్లో సొసైటీ సభ్యులను భాగస్వామ్యం చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. సమాచార హక్కు రక్షణ చట్టం సొసైటీ ప్రభుత్వ అధికారులతో సమన్వయంతో నిరంతరం ఆర్‌టిఐ చట్టం అమలుకు కృషి చేస్తుందని తెలిపారు. తమ సొసైటీ ఆధ్వర్యంలో ప్రజలకు సమాచార హక్కు చట్టంపై, భారత రాజ్యాంగ పీఠిక, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నివారణ, రోడ్ సేఫ్టీ, ప్లాస్టిక్ నివారణ పర్యావరణ పరి రక్షణ, అడవుల సంరక్షణ పై అవగాహన కార్యక్రమం చేపడుతున్నట్లు, ఇట్టి కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను సభ్యులు కలెక్టర్ గారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వంగరి ప్రవీణ్, జిల్లా సలహాదారులు రామ్టెంకి కృష్ణ, జిల్లా కోశాధికారి గజ్జల తిరుపతి, జిల్లా మీడియా కన్వీనర్ తిరుపతి, ఆసిఫాబాద్ డివిజన్ అధ్యక్షులు రవిదాస్, కాగజ్నగర్ డివిజన్ అధ్యక్షులు మాదాసు నాగేష్, జిల్లా కమిటీ సభ్యులు కుమ్మరి లింగయ్య, కాగజ్నగర్ మండల అధ్యక్షులు కడారి శ్రీనివాస్, పెంచికల్పేట్ మండల అధ్యక్షులు వీరాచారి, ఆసిఫాబాద్ మండల అధ్యక్షులు జాడి బాపురావు, వాంకిడి మండల అధ్యక్షులు దుర్గం భీమ్రావు, తీర్యానీ మండల అధ్యక్షులు నైతం కిరణ్, కౌటల మండల అధ్యక్షులు హార్థిక్, సభ్యులు దామోదర్, సురేష్, సంతోష్, గగన్ రాయ్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్‌టిఐ జిల్లా మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలి • జిల్లా కలెక్టర్ హరిత కు వినతి • సమాచార హక్కు రక్షణ చట్టం రాష్ట్ర ఉపాధ్యక్షులు డా, కొండగుర్ల కమలాకర్