గొల్లపల్లిలో పోలేరమ్మ తల్లి పొంగళ్ల మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్.. ప్రజల సుఖశాంతుల కోసం ప్రత్యేక పూజలు
వరికుంటపాడు మండలం గొల్లపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ పోలేరమ్మ తల్లి పొంగళ్ల మహోత్సవ కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. రైతులకు సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలతో అభివృద్ధి చెందాలని, ప్రతి కుటుంబం ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. పరిశ్రమలు, వ్యాపార రంగాలు అభివృద్ధి చెంది యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలని కోరుకున్నారు. గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులతో కలిసి వేడుకల్లో పాల్గొని ప్రజా సంక్షేమం, గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

గొల్లపల్లిలో పోలేరమ్మ తల్లి పొంగళ్ల మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్.. ప్రజల సుఖశాంతుల కోసం ప్రత్యేక పూజలు
గొల్లపల్లిలో పోలేరమ్మ తల్లి పొంగళ్ల మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్.. ప్రజల సుఖశాంతుల కోసం ప్రత్యేక పూజలు వరికుంటపాడు మండలం గొల్లపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ పోలేరమ్మ తల్లి పొంగళ్ల మహోత్సవ కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. రైతులకు సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలతో అభివృద్ధి చెందాలని, ప్రతి కుటుంబం ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. పరిశ్రమలు, వ్యాపార రంగాలు అభివృద్ధి చెంది యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలని కోరుకున్నారు. గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులతో కలిసి వేడుకల్లో పాల్గొని ప్రజా సంక్షేమం, గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

