Saturday, 18 April 2026
  • Home  
  • గుడిమల్లం ఆలయాభివృద్ధికి రూ. 5 లక్షల విరాళం-బృందమ్మ ఆధ్వర్యంలో చెక్కు అందజేత
- తిరుపతి

గుడిమల్లం ఆలయాభివృద్ధికి రూ. 5 లక్షల విరాళం-బృందమ్మ ఆధ్వర్యంలో చెక్కు అందజేత

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 18 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి నియోజికవర్గంలోని ఏర్పేడు మండలంలో గుడిమల్లం వున్నటువంటి ప్రసిద్ధ శైవ క్షేత్రమైన శ్రీ పరశురామేశ్వర స్వామి (గుడిమల్లం) దేవస్థాన అభివృద్ధికి ప్రముఖులు ఉదారత చాటుకున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ శనివారం ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనుల నిమిత్తం రూ. 5 లక్షల విరాళాన్ని అందజేశారు. బొజ్జల బృందమ్మతో పాటు చెరుకూరి కృష్ణమూర్తి (విష్ణు కెమికల్స్ అధినేత), మంజుల, కృష్ణమూర్తి దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బొజ్జల బృందమ్మ ఆధ్వర్యంలో రూ. 5 లక్షల విరాళానికి సంబంధించిన చెక్కును ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బత్తల గిరి నాయుడు మరియు కార్యనిర్వహణాధికారి (ఈఓ)కి అందజేశారు.దాతల సహకారంతో ఆలయ ప్రాశస్త్యాన్ని మరింత పెంచేలా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఈ సందర్భంగా ఆలయ అధికారులు తెలిపారు. విరాళం అందజేసిన ప్రముఖులను ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. ఇదే క్రమంలో త్వరలో నిర్వహించ తలపెట్టిన ఆలయ మహా కుంభాభిషేకము మహోత్సవానికి విశిష్ట అతిథులుగా విచ్చేయవలసిందిగా దేవస్థాన అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.