Thursday, 21 May 2026
  • Home  
  • గిరిజనుల సమస్యల పరిష్కారమే లక్ష్యం: బొబ్బేపల్లి సురేష్ నాయుడు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గిరిజనుల సమస్యల పరిష్కారమే లక్ష్యం: బొబ్బేపల్లి సురేష్ నాయుడు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 21 ( పున్నమి ప్రతినిధి) వెంకటాచలం మండలం పుంజులూరుపాడు ఎస్టీ కాలనీలో జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు, ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవాని నాయుడు పర్యటించారు. గిరిజన కుటుంబాల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో పేదలకు కనీస సౌకర్యాలు కూడా అందలేదని విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో పంచాయతీల అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం కృషి కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సందూరి శ్రీహరి, పోట్లూరు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 21 ( పున్నమి ప్రతినిధి)
వెంకటాచలం మండలం పుంజులూరుపాడు ఎస్టీ కాలనీలో జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు, ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవాని నాయుడు పర్యటించారు. గిరిజన కుటుంబాల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో పేదలకు కనీస సౌకర్యాలు కూడా అందలేదని విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో పంచాయతీల అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం కృషి కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సందూరి శ్రీహరి, పోట్లూరు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.