వడదెబ్బతో గుర్తుతెలియని వ్యక్తి మృతి
నెల్లూరులో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ కారణంగా ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ బొమ్మ సమీపంలో, కేఎల్ఎమ్ షోరూమ్ ఎదురుగా డివైడర్‌పై కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగించే వ్యక్తి అపస్మారక స్థితిలో పడిపోయాడు. స్థానికులు గమనించి సమాచారం అందించగా పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు గుర్తించారు. మూడు రోజులుగా మండుతున్న ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వడదెబ్బతో గుర్తుతెలియని వ్యక్తి మృతి
వడదెబ్బతో గుర్తుతెలియని వ్యక్తి మృతి నెల్లూరులో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ కారణంగా ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ బొమ్మ సమీపంలో, కేఎల్ఎమ్ షోరూమ్ ఎదురుగా డివైడర్‌పై కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగించే వ్యక్తి అపస్మారక స్థితిలో పడిపోయాడు. స్థానికులు గమనించి సమాచారం అందించగా పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు గుర్తించారు. మూడు రోజులుగా మండుతున్న ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

