*గంటలు వ్యవధిలోనే కేసును చేదించిన రెడ్డిగూడెం పోలీసులు*
*రెడ్డిగూడె మంజీర గళం ప్రతినిధి.అశోక్*
ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం తాటి గూడెం గ్రామంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయంలో 02-09-2026. బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గుడిలో ఉన్నటువంటి 2 హుండీలను దొంగలించారు.
అదే రోజు సాయంత్రం గుడి పూజారి యధావిధిగా గుడి తాళాలు వేసి ఇంటికి వెళ్ళాడు. మరుసటి రోజు 03-09-2026 గురువారం ఉదయం ఏడు గంటలకు గుడి తలుపులు తీసేందుకు వచ్చిన పూజారి గుడి తాళాలు పగలగొట్టి ఉండటం లోపల డబ్బులు హుండీలు దొంగలించబడటం గమనించి గుడి పెద్దలకు గ్రామ పెద్దలకు తెలియజేశాడు. దీంతో గ్రామ పెద్దలు గుడి వద్దకు వెళ్లి పరిశీలించి అదే రోజు సాయంత్రం గ్రామ పెద్దలందరూ చర్చించుకుని 03-09-2026 గురువారం రాత్రి 12 గంటల 30 నిమిషాలకు గ్రామ పెద్దలతో కలిసి అదే గ్రామానికి చెందిన ముక్కాల వెంకటేశ్వరరావు రెడ్డిగూడెం పోలీసులకి ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసిన రెడ్డిగూడెం పోలీసులు రంగంలోకి దిగి ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ సి.పి ఎస్. వి రాజశేఖర్ బాబు ఆదేశాల ప్రకారం, ఎన్టీఆర్ రూరల్ డిసిపి లక్ష్మీనారాయణ ఐపిఎస్ ఆదేశాలతో, ఏసిపి మైలవరం పి రామచంద్రరావు ఆధ్వర్యంలో, సీఐ కె కిషోర్ బాబు పర్యవేక్షణలో మూడు బృందాలుగా ఏర్పడి కేసును దర్యాప్తు చేయగా కేసులో చేదించిన సమాచారంతో ఏ కొండూరు మండలం కోడూరు గ్రామానికి చెందిన కట్ట రామాంజనేయులు అలియాస్ (అంజి) 27 అనే అతన్ని 04-09-2026 శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా అతనే నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. దొంగలించబడిన డబ్బుల హుండీలను పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితుడని రిమాండ్ కు తరలించారు.
అనంతరం రెడ్డిగూడెం సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ శ్రీను మాట్లాడుతూ *ఎన్టీఆర్ కమిషనరేట్ లో మొత్తం సీసీ కెమెరాలు సుమారుగా 10 వేలకు పైగా ఉన్నాయి. రెడ్డిగూడెం మండల వ్యాప్తంగా 128 సీసీ కెమెరాలు ఉన్నాయి.* కావున ఎటువంటి నేరం చేసిన పోలీసులకు దొరికి తగిన శిక్ష అనుభవించక తప్పదు. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఎవరు నేరాలకు పాల్పడొద్దు కటకటాల పాలు అవ్వద్దు అని ఎస్ఐ హెచ్చరించారు.




