నర్సంపేట నియోజకవర్గం. ఖానాపూర్ మండల .కేంద్రానికి చెందిన మానపెల్లి గోపయ్య ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందడం బాధాకరం. ఈవిషయం తెలుసుకున్న వెంటనే మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు,సర్పంచ్ దాసరి రమేష్ వారి నివాసానికి వెళ్లి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
గోపయ్య మృతి పట్ల సర్పంచ్ గారు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉప్పు రాజు, మాజీ సర్పంచ్ తక్కలపల్లి రమేష్ వార్డు సభ్యులు అజహర్ పార్టీ నాయకులు నీలం సాంబయ్య, తరాల శ్రీనివాస్, వడ్డే రాజశేఖర్, మలికంటి వెంకన్న, చెన్నూరీ సత్యం, కుందనపెళ్లి వీరన్న, కుందనపెళ్లి సుధాకర్, తరాల నరేష్, కొత్తపల్లి వెంకన్న, పసునూరి దేవేందర్,తోట జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.



