జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల విద్యాశాఖ అధికారి తిరుపతయ్య ఆధ్వర్యంలో ఖాదర్‌పూర్, సన్నవారిపల్లి, కొత్తలంపాడు గ్రామాల్లో బడి బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం విద్యతో పాటు ఉచిత పుస్తకాలు, బూట్లు, బెల్టులు, మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మంచి ఫలితాలు సాధించాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు కృష్ణకుమారి, సీఆర్‌ఎంలు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఖాదర్ పూర్ లో బడిబాట కార్యక్రమం