Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
News

ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది

వార్త ముఖ్యాంశాలు

  • ఢిల్లీ నుంచి బెంగళూరుకు వచ్చిన ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్ సమయంలో టెయిల్ స్ట్రైక్‌కు గురైంది.
  • కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది.
  • విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.

ఢిల్లీ నుంచి బెంగళూరుకు వచ్చిన ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్ సమయంలో టెయిల్ స్ట్రైక్‌కు గురైంది. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఘటన తర్వాత విమానాన్ని సాంకేతిక తనిఖీల కోసం నిలిపివేశారు. దీంతో బెంగళూరు-ఢిల్లీ తిరుగు ప్రయాణ విమానాన్ని రద్దు చేశారు. మరో విమానం టేకాఫ్ సమయంలో ఏర్పడిన గాలి ప్రభావం వల్ల ఈ ఘటన జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టనున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *