உண்மையான செய்தி. விரைவான தகவல். ஆந்திரப் பிரதேசம் • தெலங்கானா • தேசியம்
ஆசிரியர் பலகம்
News

కుర్చీ పోరా.. ఆత్మకూరు అభివృద్ధి పోరా?

புன்னமி செய்தியறை வெளியீடு: புதுப்பிப்பு:
కుర్చీ పోరా.. ఆత్మకూరు అభివృద్ధి పోరా?

செய்தியின் முக்கிய அம்சங்கள்

  • ఆత్మకూరు, అక్టోబర్ 6 ( కోటకొండ హరికిరణ్, పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు పురపాలక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.
  • అధికార కూటమి వ్యూహాలు, ప్రతిపక్ష పార్టీల కసరత్తు, వార్డుల వారీగా బలాబలాల అంచనాలతో పట్టణంలో ఎన్నికల సందడి మొదలైంది.
  • ఈ నేపథ్యంలో పార్టీల మధ్య పోటీతో పాటు ఆత్మకూరు అభివృద్ధికి అన్ని రాజకీయ శక్తులు కలిసి పనిచేయాలనే అంశం కూడా చర్చకు వస్తోంది.

ఆత్మకూరు, అక్టోబర్ 6 ( కోటకొండ హరికిరణ్, పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు పురపాలక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అధికార కూటమి వ్యూహాలు, ప్రతిపక్ష పార్టీల కసరత్తు, వార్డుల వారీగా బలాబలాల అంచనాలతో పట్టణంలో ఎన్నికల సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో పార్టీల మధ్య పోటీతో పాటు ఆత్మకూరు అభివృద్ధికి అన్ని రాజకీయ శక్తులు కలిసి పనిచేయాలనే అంశం కూడా చర్చకు వస్తోంది.

రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పురపాలక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు ఇటీవల చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఐక్యతను కొనసాగించే దిశగా కసరత్తు జరుగుతోంది.

ఇదే సమయంలో పురపాలక ఎన్నికల్లో కూటమి భాగస్వామ్య పక్షాలు కలిసి పోటీ చేస్తాయా? లేక స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆయా పార్టీలు స్వతంత్రంగా బరిలోకి దిగుతాయా? అన్నదానిపై ఆసక్తి నెలకొంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా తమ బలాన్ని చాటుకునేందుకు వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి.

ఆత్మకూరు పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిదీపాలు, పార్కులు, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రజల్లో ప్రధానంగా చర్చ జరుగుతోంది. పట్టణానికి భారీ స్థాయిలో అభివృద్ధి నిధులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిని సమర్థవంతంగా వినియోగించేందుకు దీర్ఘకాలిక ప్రణాళిక అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఎన్నికల సమయంలో పార్టీలు పరస్పరం పోటీ పడటం సహజమే అయినా.. ఎన్నికల అనంతరం పట్టణ అభివృద్ధి అంశాల్లో సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. అన్ని పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యల పరిష్కారంలో కలిసి పనిచేస్తే అభివృద్ధి పనులకు మరింత ఊతం లభించే అవకాశం ఉంది.

ఆత్మకూరు అభివృద్ధి కోసం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య కనీస ఉమ్మడి కార్యాచరణ రూపొందితే.. పురపాలక పాలనలో కొత్త విధానానికి నాంది పలికినట్లవుతుందనే చర్చ జరుగుతోంది. పట్టణానికి సంబంధించిన కీలక నిర్ణయాల్లో ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం, అభివృద్ధి నిధుల వినియోగంలో పారదర్శకత పాటించడం, ప్రధాన సమస్యల పరిష్కారానికి సమిష్టి నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాలపై ఏకాభిప్రాయం అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.పురపాలక ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది రాజకీయంగా కీలకమైనప్పటికీ.. ఎన్నికల అనంతరం ఆత్మకూరు అభివృద్ధికి అన్ని పార్టీలు కలిసి పనిచేస్తాయా? అన్నదే ప్రజల్లో ప్రధాన చర్చగా మారుతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *