ఎస్పీ ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా మే 8 పున్నమి ప్రతినిధి
మనుబోలు మండల పరిషత్ కార్యాలయంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం రీసర్వే ప్రక్రియను తప్పుల కుప్పగా మార్చిందని, కొన్ని గ్రామాలను అన్యాయంగా 22ఏ జాబితాలో చేర్చిందని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రతి తప్పును సరిదిద్దుతూ రైతులకు న్యాయం చేస్తోందన్నారు. మైక్రో ఇరిగేషన్, యాంత్రీకరణకు మళ్లీ ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ఎలినినో ప్రభావం నేపథ్యంలో రెండో పంట విషయంలో రైతులు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

వైసీపీ తప్పిదాల సవరణకు కూటమి ప్రభుత్వం కృషి : సోమిరెడ్డి
ఎస్పీ ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా మే 8 పున్నమి ప్రతినిధి మనుబోలు మండల పరిషత్ కార్యాలయంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం రీసర్వే ప్రక్రియను తప్పుల కుప్పగా మార్చిందని, కొన్ని గ్రామాలను అన్యాయంగా 22ఏ జాబితాలో చేర్చిందని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రతి తప్పును సరిదిద్దుతూ రైతులకు న్యాయం చేస్తోందన్నారు. మైక్రో ఇరిగేషన్, యాంత్రీకరణకు మళ్లీ ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ఎలినినో ప్రభావం నేపథ్యంలో రెండో పంట విషయంలో రైతులు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

