Tuesday, 23 June 2026
  • Home  
  • ఖమ్మంలో విజయవంతమైన ఏబీవీపీ పాఠశాలల బంద్
- ఖమ్మం

ఖమ్మంలో విజయవంతమైన ఏబీవీపీ పాఠశాలల బంద్

ఖమ్మం, జూన్ (పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి జిల్లా రిపోర్టర్ ) అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన పాఠశాలల బంద్ పిలుపు మంగళవారం ఖమ్మం జిల్లాలో విజయవంతమైంది. బంద్ నేపథ్యంలో జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు ముందస్తుగా సెలవు ప్రకటించాయి. ఖమ్మం, సత్తుపల్లి, వైరా, మధిర, పాలేరు నియోజకవర్గాల్లో బంద్‌కు విశేష స్పందన లభించింది. విద్యాసంస్థలు మూతపడగా, విద్యార్థులు పాఠశాలలకు హాజరుకాలేదు. పాఠశాలల బంద్ ప్రశాంత వాతావరణంలో కొనసాగిందని ఏబీవీపీ నాయకులు తెలిపారు. విద్యా రంగ సమస్యల పరిష్కారం, విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ బంద్‌కు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహించారు.

ఖమ్మం, జూన్
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి జిల్లా రిపోర్టర్ )

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన పాఠశాలల బంద్ పిలుపు మంగళవారం ఖమ్మం జిల్లాలో విజయవంతమైంది. బంద్ నేపథ్యంలో జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు ముందస్తుగా సెలవు ప్రకటించాయి. ఖమ్మం, సత్తుపల్లి, వైరా, మధిర, పాలేరు నియోజకవర్గాల్లో బంద్‌కు విశేష స్పందన లభించింది. విద్యాసంస్థలు మూతపడగా, విద్యార్థులు పాఠశాలలకు హాజరుకాలేదు. పాఠశాలల బంద్ ప్రశాంత వాతావరణంలో కొనసాగిందని ఏబీవీపీ నాయకులు తెలిపారు. విద్యా రంగ సమస్యల పరిష్కారం, విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ బంద్‌కు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.