ఖమ్మం: గోద్రేజ్ అగ్రోవెట్ లిమిటెడ్‌కు చెందిన పామ్ ఆయిల్‌ను అక్రమంగా విక్రయించిన కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. సెప్టెంబర్ 23న మేనేజర్ వకలపూడి రామచంద్రరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ట్యాంకర్ డ్రైవర్ షేక్ కమరుద్దీన్, ఆయిల్ వ్యాపారి ల్ల కనకయ్య, ఆటో డ్రైవర్ బతిని గోపినాధ్, ఉద్యోగి రా శ్రీనివాసరావును అరెస్టు చేశారు. మరో ఎనిమిది మంది షేక్ ఫెరోజుద్దిన్, జయరాజు, చంటి, బాలంజనేయులు బడినీడి, చౌదరి, నరేష్ ఆయిల్, కోడాడ ఆయిల్, కల్లూరు రెడ్డి పరారీలో ఉన్నారు. ట్యాంకర్, ఆటో, 31 కేన్లు, నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం లావాదేవీలు రూ.9.30 లక్షలుగా గుర్తించారు. దర్యాప్తు కొనసాగుతోంది.



