Saturday, 16 May 2026
  • Home  
  • ఖమ్మంకు క్రికెట్ కళకు “రఘురాం” కసరత్తు
- ఖమ్మం

ఖమ్మంకు క్రికెట్ కళకు “రఘురాం” కసరత్తు

ఖమ్మం మే (పున్నమి న్యూస్ జిల్లా ప్రతినిధి ) 👉 ​స్టేడియం వేటలో ఎంపీ రామసహాయం 👉రఘునాథపాలెం మండలం జింకల తండా, ఖమ్మం రూరల్ తల్లంపాడు వద్ద ​స్వయంగా గుట్టల పైకి ఎక్కి స్థలాల పరిశీలన ​ఖమ్మంనగర సమీపంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కావాల్సిన సాధ్యాసాధ్యాలపై ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ కోరిక మేరకు ఆయన రఘునాధపాలెం మండలం జింకల తండా సమీపంలో గుట్టల ప్రాంతం, ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు వద్ద హైవే వెంట ఉన్న కొండల ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు. స్టేడియం నిర్మాణానికి అనువైన స్థలం కోసం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. ​శ్రమకోర్చి.. గుట్టపైకి స్టేడియం నిర్మాణానికి విశాలమైన, అనువైన భూమిని గుర్తించే క్రమంలో ఎంపీ రఘురాం రెడ్డి శ్రమను లెక్కచేయకుండా రాళ్లు, రప్పలతో నిండిన గుట్టపైకి కాలినడకన ఎక్కారు. ఎగుడుదిగుడు మార్గాల గుండా ప్రయాణించి, గుట్టపై నుంచి చుట్టుపక్కల ప్రాంతాలను నిశితంగా పరిశీలించారు. ఖమ్మం క్రీడాకారుల కలల ప్రాజెక్టు అయిన క్రికెట్ స్టేడియం నిర్మాణానికి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు ఎంపీ తెలిపారు. ఈ పర్యటనలో…: జాయింట్ కలెక్టర్ శ్రీనివాస రెడ్డి, డీవైఎస్ఓ సునీల్ రెడ్డి, రఘునాథపాలెం ఎమ్మార్వో ఎస్.శ్వేత, ఖమ్మం రూరల్ ఎమ్మార్వో విజయేందర్ రెడ్డి, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం మే
(పున్నమి న్యూస్ జిల్లా ప్రతినిధి )

👉 ​స్టేడియం వేటలో ఎంపీ రామసహాయం
👉రఘునాథపాలెం మండలం జింకల తండా, ఖమ్మం రూరల్ తల్లంపాడు వద్ద ​స్వయంగా గుట్టల పైకి ఎక్కి స్థలాల పరిశీలన

​ఖమ్మంనగర సమీపంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కావాల్సిన సాధ్యాసాధ్యాలపై ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ కోరిక మేరకు ఆయన రఘునాధపాలెం మండలం జింకల తండా సమీపంలో గుట్టల ప్రాంతం, ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు వద్ద హైవే వెంట ఉన్న కొండల ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు. స్టేడియం నిర్మాణానికి అనువైన స్థలం కోసం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు.
​శ్రమకోర్చి.. గుట్టపైకి
స్టేడియం నిర్మాణానికి విశాలమైన, అనువైన భూమిని గుర్తించే క్రమంలో ఎంపీ రఘురాం రెడ్డి శ్రమను లెక్కచేయకుండా రాళ్లు, రప్పలతో నిండిన గుట్టపైకి కాలినడకన ఎక్కారు. ఎగుడుదిగుడు మార్గాల గుండా ప్రయాణించి, గుట్టపై నుంచి చుట్టుపక్కల ప్రాంతాలను నిశితంగా పరిశీలించారు. ఖమ్మం క్రీడాకారుల కలల ప్రాజెక్టు అయిన క్రికెట్ స్టేడియం నిర్మాణానికి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు ఎంపీ తెలిపారు.
ఈ పర్యటనలో…: జాయింట్ కలెక్టర్ శ్రీనివాస రెడ్డి, డీవైఎస్ఓ సునీల్ రెడ్డి, రఘునాథపాలెం ఎమ్మార్వో ఎస్.శ్వేత, ఖమ్మం రూరల్ ఎమ్మార్వో విజయేందర్ రెడ్డి, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.