Monday, 24 August 2026
  • Home  
  • క్యాన్సర్ అవగాహన కోసం నెల్లూరులో క్రికెట్ టోర్నమెంట్!
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

క్యాన్సర్ అవగాహన కోసం నెల్లూరులో క్రికెట్ టోర్నమెంట్!

నెల్లూరు : నెల్లూరులో క్యాన్సర్ అవగాహన కోసం మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు క్రికెట్ టోర్నమెంట్. ప్రారంభించిన టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. నెల్లూరు : క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్& హాస్పిటల్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయులతో కలిసి కనుపర్తిపాడు ZP హై స్కూల్ నందు క్యాన్సర్ పై అవగాహన క్రికెట్ టోర్నమెంట్ ఈ కార్యక్రమానికి టీడీపీ అధికార ప్రతినిధి శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు కోటంరెడ్డి గిరిదర్ రెడ్డి మాట్లాడుతూ క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు క్రీడలను వేదికగా ఎంచుకోవడం ఎంతో మంచి ఆలోచన. క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి, సకాలంలో సరైన చికిత్స తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ, క్యాన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపుపై అవగాహన పెంచుకోవాలి. ప్రజారోగ్యం కోసం మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అభినందనీయం. మెడికవర్ వైద్యులు రమేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించడం కూడా ఉపాధ్యాయుల బాధ్యత. క్యాన్సర్‌పై అవగాహన సందేశాన్ని విద్యార్థులు, వారి కుటుంబాలు, సమాజంలోని ప్రతి ఒక్కరికీ తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడింది” అని తెలిపారు. క్రీడల ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలి, క్యాన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపు వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని మెడికవర్ సెంటర్ హెడ్ టి పవన్ కుమార్ తెలిపారు. ఈకార్యక్రమం లో, ప్రభుత్వ ఉపాధ్యాయులు,24 వ డివిజన్ కార్పొరేటర్ అరవ శ్రీనివాసులు, రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంచార్జి దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, స్థానిక టీడీపీ నాయకులు, మెడికవర్ హాస్పిటల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

నెల్లూరు : నెల్లూరులో క్యాన్సర్ అవగాహన కోసం మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు క్రికెట్ టోర్నమెంట్. ప్రారంభించిన టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

నెల్లూరు : క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్& హాస్పిటల్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయులతో కలిసి కనుపర్తిపాడు ZP హై స్కూల్ నందు క్యాన్సర్ పై అవగాహన క్రికెట్ టోర్నమెంట్ ఈ కార్యక్రమానికి టీడీపీ అధికార ప్రతినిధి శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు కోటంరెడ్డి గిరిదర్ రెడ్డి మాట్లాడుతూ క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు క్రీడలను వేదికగా ఎంచుకోవడం ఎంతో మంచి ఆలోచన. క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి, సకాలంలో సరైన చికిత్స తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ, క్యాన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపుపై అవగాహన పెంచుకోవాలి. ప్రజారోగ్యం కోసం మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అభినందనీయం.
మెడికవర్ వైద్యులు రమేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించడం కూడా ఉపాధ్యాయుల బాధ్యత. క్యాన్సర్‌పై అవగాహన సందేశాన్ని విద్యార్థులు, వారి కుటుంబాలు, సమాజంలోని ప్రతి ఒక్కరికీ తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడింది” అని తెలిపారు. క్రీడల ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలి, క్యాన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపు వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని మెడికవర్ సెంటర్ హెడ్ టి పవన్ కుమార్ తెలిపారు. ఈకార్యక్రమం లో, ప్రభుత్వ ఉపాధ్యాయులు,24 వ డివిజన్ కార్పొరేటర్ అరవ శ్రీనివాసులు, రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంచార్జి దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, స్థానిక టీడీపీ నాయకులు, మెడికవర్ హాస్పిటల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.