పున్నమి ప్రతినిధి, తిరుపతి రూరల్ జూలై 24
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన స్వగృహానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛంతో పాటు జ్ఞాపికను అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రజా జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కేసీఆర్ కుటుంబంతో చెవిరెడ్డికి దశాబ్దాలుగా వున్న ఆత్మీయ సంబంధాల రీత్యా ఆత్మీయంగా పలకరించుకుని ఇద్దరూ కొద్దిసేపు పలు అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకున్నారు.



