Tuesday, 19 May 2026
  • Home  
  • కాలుష్య నివారణ, ఇంధన పొదుపు మనందరి బాధ్యత-ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
- తిరుపతి

కాలుష్య నివారణ, ఇంధన పొదుపు మనందరి బాధ్యత-ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

శ్రీ కాళహస్తి, మే 19, (పున్నమి న్యూస్): కాలుష్య నివారణ, ఇంధన పొదుపే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపునకు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మనస్ఫూర్తిగా మద్దతు ప్రకటించారు. ఇందులో భాగంగా నియోజకవర్గ పర్యటనలో కార్లను పక్కన పెట్టి, ద్విచక్ర వాహనం (టూ-వీలర్) పై ఆయన క్షేత్రస్థాయికి వెళ్లారు. ఈ సందర్భంగా ఇంధన సంరక్షణ అనేది కేవలం ప్రభుత్వాల విధి కాదని, అది మనందరి సామాజిక బాధ్యతని స్పష్టం చేశారు. భవిష్యత్ తరాలకు ఇంధన సంక్షోభం రాకుండా ఉండాలంటే.. ప్రతి ఒక్కరూ వారంలో కనీసం ఒక్కసారైనా సొంత కార్లకు బదులు బైక్, సైకిల్ లేదా ప్రజా రవాణాను ఉపయోగించాలని నియోజకవర్గ ప్రజాప్రతినిధులను, ప్రజలను కోరారు. అందరం కలిసికట్టుగా పర్యావరణాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.