డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన కాట్రేనికోనలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన సత్యవతి మెమోరియల్ డైనింగ్ హాల్‌ను శాసనసభ విప్, ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ తమ తల్లి సత్యవతి స్మారకార్థం ఆమె కుమారులు రూ.10 లక్షల వ్యయంతో ఈ డైనింగ్ హాల్‌ను నిర్మించి విద్యార్థులకు అంకితం చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. సమాజ సేవా దృక్పథంతో చేపట్టిన ఈ కార్యక్రమం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.ప్రభుత్వం విద్యా రంగ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నప్పటికీ, దాతలు మరియు సేవాభావం కలిగిన కుటుంబాలు ముందుకు వచ్చి విద్యాసంస్థల అభివృద్ధికి తోడ్పడటం ఎంతో గొప్ప విషయమని తెలిపారు. సమాజంలో స్థిరపడిన ప్రతి ఒక్కరూ తమ గ్రామాల అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.ఈ డైనింగ్ హాల్ ద్వారా విద్యార్థులు పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం చేసే అవకాశం కలుగుతుందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాగిడి నాగేశ్వరావు,ముమ్మిడివరం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్ పర్సన్ ఓగూరి భాగ్యశ్రీ, సీనియర్ నాయకులు వనచర్ల నాగేశ్వరరావు,వెసింగి రంగారావు వర్మ,వెంట్రు సుధీర్,ఇసుకపట్ల రాంబాబు,దండుప్రోలు సత్యం, మోకా అప్పాజీ,మోకా బాల ప్రసాద్, కూటమి నాయకులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

కాట్రేనికోన ఉన్నతపాఠశాలలో దాతలు నిర్మించిన డైనింగ్ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు