Tuesday, 18 August 2026
  • Home  
  • కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయి నుంచే కార్యాచరణ: మీనాక్షీ నటరాజన్
- మేడ్చల్ – మల్కాజిగిరి

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయి నుంచే కార్యాచరణ: మీనాక్షీ నటరాజన్

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంపై పార్టీ నాయకత్వం దృష్టి సారించింది. గాంధీ భవన్‌లో ఏఐసీసీ  తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పిఎసి  సమావేశంలో కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయడం, ప్రజలకు మరింత చేరువ కావడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా మీనాక్షీ నటరాజన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు మరింత పటిష్టంగా తీర్చిదిద్దేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజా సమస్యలను నిరంతరం తెలుసుకుంటూ, వాటి పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో చురుకైన పాత్ర పోషించాలని అన్నారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు ప్రతి కార్యకర్తను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే ఎస్ ఐ ఆర్  కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ నాయకుడు ఎప్పటికప్పుడు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ, కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని, వారి కృషి, సమష్టి నాయకత్వంతోనే కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయగలమని మీనాక్షీ నటరాజన్ అన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేసేందుకు అవసరమైన కార్యాచరణపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనంపల్లి హనుమంతరావు, సుధీర్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి, వజ్రేష్ యాదవ్, హరివర్ధన్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, బండి రమేష్, పరమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంపై పార్టీ నాయకత్వం దృష్టి సారించింది. గాంధీ భవన్‌లో ఏఐసీసీ  తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పిఎసి  సమావేశంలో కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయడం, ప్రజలకు మరింత చేరువ కావడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా మీనాక్షీ నటరాజన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు మరింత పటిష్టంగా తీర్చిదిద్దేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజా సమస్యలను నిరంతరం తెలుసుకుంటూ, వాటి పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో చురుకైన పాత్ర పోషించాలని అన్నారు.
పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు ప్రతి కార్యకర్తను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే ఎస్ ఐ ఆర్  కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ నాయకుడు ఎప్పటికప్పుడు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ, కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని, వారి కృషి, సమష్టి నాయకత్వంతోనే కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయగలమని మీనాక్షీ నటరాజన్ అన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేసేందుకు అవసరమైన కార్యాచరణపై నాయకులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనంపల్లి హనుమంతరావు, సుధీర్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి, వజ్రేష్ యాదవ్, హరివర్ధన్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, బండి రమేష్, పరమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.