ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతోంది. మీకు అందిన ఎన్యూమరేషన్ ఫారం (Enumeration Form)ను పూర్తి చేసి జూలై 14లోపు మీ ప్రాంత BLO (Booth Level Officer)కు తప్పనిసరిగా అందజేయాలి.
ఇప్పటివరకు రాష్ట్రంలోని 4.16 కోట్ల ఓటర్లలో కేవలం 1.56 కోట్ల మంది (37.66%) మాత్రమే నింపిన ఫారాలను తిరిగి సమర్పించారు.
గడువులోగా ఫారం ఇవ్వకపోతే జూలై 21న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ల జాబితాలో మీ పేరు లేకపోయే అవకాశం ఉంది. దీంతో ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది.
ఎన్యూమరేషన్ ఫారం ఎలా నింపాలి? పూర్తి వివరాలు, ఆన్‌లైన్ దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాలు, FAQs కోసం.

