బెల్లంపల్లిలో ఏరియా ఆసుపత్రి నుండి కొత్త బస్టాండ్ వరకు రోడ్డు మరమ్మతులు చేయాలని ఎంసీపీఐయూ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట రహదారిపై నిరసన తెలిపారు. నాయకులు మాట్లాడుతూ రోడ్లు గుంతలమయం కావడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని, గుంతలలో పడి వాహనదారులు గాయాలపాలు అవుతున్నారని వాపోయారు. వెంటనే అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు

రోడ్డు మరమ్మతులు చేయాలని ఎంసీపీఐయూ నిరసన