తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కోసం సమిష్టిగా కృషి చేయని పరిస్థితుల్లో మరల చీకటి రోజుల తప్పవని గత ఐదేళ్లలో జగన్ పాలనలో పడ్డ ఇబ్బందులను తూర్పు రాయలసీమ నియోజకవర్గ శాసన మండలి సభ్యులు కుప్పం అభి వృద్ధి ప్రత్యేక ఇంచార్జ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ హెచ్చరించారు .ఆదివారం సాయంత్రం వింజమూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో జరిగిన
సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ,వి.ఒ.ఎ (వెలుగు) సిబ్బందికి స్మార్ట్ ఫోన్స్ పంపిణీ కార్యక్రమం లో శ్రీకాంత్ మాట్లాడుతూ ఏడుపదుల వయసులో చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం పడుతున్న శ్రమ మరువలేనిదని అమరావతి నిర్మాణంలో ఆయన పడుతున్న ఆరాటం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు నేతలు సమిష్టిగా ఆయన ఆశయాల మేరకు పని చేయాల్సిన అవసరం ఉందని అదే ఆయనకు వేయి ఏనుగుల బలంగా పేర్కొన్నారు. అలా కాకుండా ఎవరు పాటికి వారు పార్టీ నిబంధనల ఉల్లంఘించి వ్యవహరిస్తే భవిష్యత్తు చీకటేనని హెచ్చరించారు. జగన్ ప్రభుత్వం రప్ప. రప్ప. అంటూ నరుకుడే తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని ఈ రాష్ట్రానికి సంక్షేమం అంటూ జరిగితే కేవలం చంద్రబాబు వలనే అని పేర్కొన్నారు. పార్టీ పరంగా రకరకాల భావాల గల వ్యక్తులు ఉన్నప్పుడు సమస్యలు సహజమేనని వాటిని కుటుంబ సమస్యలుగా భావిస్తూ కూర్చొని పరిష్కరించుకోవాలి తప్ప వీధికి ఎక్కితే పార్టీ కి ఇబ్బందులు తప్పవని శ్రీకాంత్ హెచ్చరించారు. నియోజకవర్గంలో యువకుడైన కాకర్ల సురేష్ లాంటి శాసనసభ్యుడు నాయకత్వంలో పార్టీ కేడర్ అంతా ఉత్సాహంగా పనిచేస్తూ భవిష్యత్తులో మరో పార్టీకి అవకాశం లేకుండా ఉదయగిరిని కంచుకోటగా తీర్చిదిద్దాలని శ్రీకాంత్ సూచించారు. పార్టీ లో హక్కులతో పాటు బాధ్యతలను కూడా పంచుకోవాలని కోరారు.
సింగనమల నియోజకవర్గ శాసన సభ్యురాలు బండారు శ్రావణి శ్రీ ముఖ్య అతిథులుగా హాజరయ్యి
ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హులైన కుటుంబానికి చేరేలా కృషి చేయాలని కోరారు.. వెలుగు సిబ్బందికి స్మార్ట్ ఫోన్స్ అందజేయడం ద్వారా సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తన మనుగడ వైభవంగా సాగించాలని ఈ సందర్భంగా ఆకర్షించారు.

ఐకమత్యం లేకపోతే చీకటి రోజులే… కార్యకర్తలకు కంచర్ల శ్రీకాంత్ హెచ్చరిక
తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కోసం సమిష్టిగా కృషి చేయని పరిస్థితుల్లో మరల చీకటి రోజుల తప్పవని గత ఐదేళ్లలో జగన్ పాలనలో పడ్డ ఇబ్బందులను తూర్పు రాయలసీమ నియోజకవర్గ శాసన మండలి సభ్యులు కుప్పం అభి వృద్ధి ప్రత్యేక ఇంచార్జ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ హెచ్చరించారు .ఆదివారం సాయంత్రం వింజమూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో జరిగిన సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ,వి.ఒ.ఎ (వెలుగు) సిబ్బందికి స్మార్ట్ ఫోన్స్ పంపిణీ కార్యక్రమం లో శ్రీకాంత్ మాట్లాడుతూ ఏడుపదుల వయసులో చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం పడుతున్న శ్రమ మరువలేనిదని అమరావతి నిర్మాణంలో ఆయన పడుతున్న ఆరాటం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు నేతలు సమిష్టిగా ఆయన ఆశయాల మేరకు పని చేయాల్సిన అవసరం ఉందని అదే ఆయనకు వేయి ఏనుగుల బలంగా పేర్కొన్నారు. అలా కాకుండా ఎవరు పాటికి వారు పార్టీ నిబంధనల ఉల్లంఘించి వ్యవహరిస్తే భవిష్యత్తు చీకటేనని హెచ్చరించారు. జగన్ ప్రభుత్వం రప్ప. రప్ప. అంటూ నరుకుడే తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని ఈ రాష్ట్రానికి సంక్షేమం అంటూ జరిగితే కేవలం చంద్రబాబు వలనే అని పేర్కొన్నారు. పార్టీ పరంగా రకరకాల భావాల గల వ్యక్తులు ఉన్నప్పుడు సమస్యలు సహజమేనని వాటిని కుటుంబ సమస్యలుగా భావిస్తూ కూర్చొని పరిష్కరించుకోవాలి తప్ప వీధికి ఎక్కితే పార్టీ కి ఇబ్బందులు తప్పవని శ్రీకాంత్ హెచ్చరించారు. నియోజకవర్గంలో యువకుడైన కాకర్ల సురేష్ లాంటి శాసనసభ్యుడు నాయకత్వంలో పార్టీ కేడర్ అంతా ఉత్సాహంగా పనిచేస్తూ భవిష్యత్తులో మరో పార్టీకి అవకాశం లేకుండా ఉదయగిరిని కంచుకోటగా తీర్చిదిద్దాలని శ్రీకాంత్ సూచించారు. పార్టీ లో హక్కులతో పాటు బాధ్యతలను కూడా పంచుకోవాలని కోరారు. సింగనమల నియోజకవర్గ శాసన సభ్యురాలు బండారు శ్రావణి శ్రీ ముఖ్య అతిథులుగా హాజరయ్యి ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హులైన కుటుంబానికి చేరేలా కృషి చేయాలని కోరారు.. వెలుగు సిబ్బందికి స్మార్ట్ ఫోన్స్ అందజేయడం ద్వారా సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తన మనుగడ వైభవంగా సాగించాలని ఈ సందర్భంగా ఆకర్షించారు.

