శ్రీకాళహస్తి, మే 03 (పున్నమి న్యూస్): ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన పలువురు విద్యార్థులు 590కి పైగా మార్కులు సాధించి ప్రతిభ కనబర్చారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తన స్వగృహానికి ఆహ్వానించి అల్పాహార విందు ఏర్పాటు చేశారు. విద్యార్థులతో సాన్నిహిత్యంగా ముచ్చటిస్తూ వారి భవిష్యత్తు లక్ష్యాలను తెలుసుకుని మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బొజ్జల బృందమ్మ, బొజ్జల రిషిత రెడ్డి పాల్గొని విద్యార్థులను అభినందించి ఆశీస్సులు అందించారు. ఈ స్పూర్తిదాయక కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తన సామాజిక మాధ్యమాల్లో పంచుకుని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చొరవను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. విద్యార్థుల విజయాన్ని ప్రోత్సహించే ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎమ్మెల్యే సుధీర్ చొరవకు మంత్రి లోకేష్ ప్రశంసలు