బిక్కవోలు, సెప్టెంబర్ 1 (పున్నమి ప్రతినిధి): SIR రెండో దశలో క్లెయిమ్స్, అభ్యంతరాలు దాఖలు చేసేందుకు గడువును పొడిగించాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి ఇటీవల ఎన్నికల కమిషన్కు చేసిన విజ్ఞప్తికి స్పందన లభించింది. ఆయన విజ్ఞప్తి మేరకు SIR రెండో దశ క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ గడువును ఎన్నికల కమిషన్ మరో 10 రోజుల పాటు పొడిగిస్తూ సెప్టెంబర్ 10 వరకు అవకాశం కల్పించింది.
ఈ గడువు పొడిగింపుతో ఓటర్ల జాబితాకు సంబంధించి అభ్యంతరాలు, క్లెయిమ్స్ దాఖలు చేసేందుకు ప్రజలకు మరో అవకాశం లభించిందని ఎమ్మెల్యే నల్లమిల్లి తెలిపారు. ముఖ్యంగా అర్హత లేని ఓట్లపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటు, అర్హులైన వారి పేర్లు ఓటర్ల జాబితాలో లేకపోతే వాటికి సంబంధించి అవసరమైన క్లెయిమ్స్ దాఖలు చేసుకునే అవకాశం ఉందన్నారు.
అదేవిధంగా అవసరమైన సందర్భాల్లో ఫారం–7 దాఖలు చేసేందుకు కూడా గడువు పొడిగింపు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓటర్ల జాబితా పరిశీలనలో కూటమి నాయకులు, కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని ఎమ్మెల్యే నల్లమిల్లి సూచించారు.



