సీజనల్ వ్యాధులపై ఆరోగ్య క్యాంపుల్ నిర్వహించాలి.
మండల అభివృద్ధి అధికారి పల్లి భాగ్యశ్రీ.
ఏన్కూరు:
సీజన్ వ్యాధులపై ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉంది గ్రామాలలో క్యాంపుల్ నిర్వహించాలని మండల అభివృద్ధి అధికారి పల్లి భాగ్యశ్రీ కోరారు.వర్షాకాలంలో ముందస్తు చర్యలపై బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్లపై మరుగు నీరు చేరకుండా చూసుకోవాలని గ్రామపంచాయతీ కార్యదర్శులు కోరారు. ఇంకుడు గుంతల నీరు రోడ్లపై రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. వరద ముంపు ప్రమాదాల నివారణకు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గాలి దుమారాలకు ఇది అధికారులు అప్రమత్తంగా ఉండి వెంటనే చర్యలు చేపట్టే విధంగా చూడాలని కోరారు.వర్షాకాలంలో విరివిగా మొక్కలు నాటాలని తెలిపారు. విద్యుత్ ప్రమాదాల పై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిపిఓ జివిఎస్ నారాయణ, ప్రభుత్వ వైద్యాధికారి నాగమణి, పంచాయతీరాజ్ ఏఈ సూర్యనారాయణ, మండల వ్యవసాయ అధికారి నరసింహారావు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.


