ఎన్ ఎస్ యుఐ నియోజకవర్గం అధ్యక్షునిగా ఆయాన్ పటేల్
ఎమ్మెల్యే చేతుల మీదుగా నియామక పత్రం అందజేత
పున్నమి న్యూస్ ప్రతినిధి
20 మే 2026
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ :
ఎన్ ఎస్ యుఐ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అధ్యక్షునిగా ఆయాన్ పటేల్ నియామకం. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆయా మండల అధ్యక్షులను, మున్సిపల్ డివిజన్ల అధ్యక్ష కార్యదర్శుల నియామకాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా బుధవారం ఎన్ ఎస్ యుఐ నియోజకవర్గం అధ్యక్షునిగా మహమ్మద్ అయాన్ పటేల్ను నియమిస్తూ, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి చేతుల మీదుగా అయాన్ పటేల్ కు ధ్రువపత్రం అందించారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను శ్రద్ధతో సమర్థవంతంగా నెరవేరుస్తానని, నమ్మకాన్ని వమ్ము చేయనని అయాన్ పటేల్ అన్నారు.



