ఇల్లంతకుంట. ఏప్రిల్ 16 , పున్నమి ప్రతినధి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు బెంద్రం తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
మండలానికి వచ్చే వేలాది మంది ప్రజలు ఎండ వేడి నుంచి కొంత ఉపశమనం పొందేందుకు BTR (Bendram Thirupati Reddy) ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు మజ్జిగ తీసుకుని నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఉపాధ్యక్షులు బొల్లారం ప్రసన్న కుమార్, బొల్లం రాంసాగర్, కమల్ల ఎల్లెష్, మ్యకల మల్లేశం, దూది వెంకట్ రెడ్డి, చిత్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


