*
*పంటలు సాగుచేసే అవకాశాలున్నా నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వం.*
*ఎరువుల లభ్యతపైనా రైతాంగంలో తీవ్ర ఆందోళన.*
*వై.ఎస్ .జగన్ సర్కార్ పంటల బీమా ప్రీమియం ప్రతి ఏటా చెల్లించి రైతులను ఆదుకుంది.*
*రైతాంగ సమస్యలను పట్టించుకోని కూటమి సర్కార్ పై వైయస్సార్ సిపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం ద్వజం.*
*ఎల్ నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటె 0.5 డిగ్రీల సి ఎక్కువ పెరిగి నైరుతి రుతుపవణాలు బలహీన పడే అవకాశం, సాధారణo కంటె తక్కువ వర్షపాతం, కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం, వ్యవసాయ దిగుబడులు తగ్గే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తుంటే దీనిపై నారా చంద్రబాబు నాయుడు సర్కార్ ముందస్తు చర్యలు తీసు కోకపోవడంతో రైతాంగం లో తీవ్ర ఆందోళన నెలకొని ఉందని వైఎస్సార్ సిపీ రాష్ట్ర కార్యదర్శి, వైఎస్ఆర్సిపి కడప జిల్లా రైతు పోరాట సమితి మాజీ అధ్యక్షుడు రెడ్యం వెంకట సుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. కడప నగరంలోని వైఎస్సార్ జిల్లా కార్యాలయంలో సోమవారం రెడ్యం విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్ కడప జిల్లా వ్యాప్తంగా 2026-2027 ఖరీఫ్ సీజన్ కు సంబందించి సుమారు 2.80లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేసే అవకాశాలున్నాయన్నారు. ఇందులో ప్రధానంగా లక్ష ఎకరాల్లో వరిపంట,30 వేల ఎకరాల్లో పత్తి పంట, 30 వేల ఎకరాల్లో కందిపంట, 20వేల ఎకరాల్లో మొక్కజొన్న,మరో లక్ష ఎకరాల్లో వివిధ రకాల ఉద్యానవన పంటలు సాగు చేసే అవకాశాలున్నాయని ఆయన గణంకాలతో వివరించారు. దీనికి సంబంధించి సుమారు 45 వేల మెట్రిక్ టన్నుల యూరియా,25 వేల మెట్రిక్ టన్నుల డి ఏ పి,32 వేల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు 10 వేల మెట్రిక్ టన్నుల ఎంఓపి, 7 వేల మెట్రికన్నుల సూపర్ ఫాస్పేట్ మొత్తంగా ఒక లక్షా 19 వేల మెట్రిక్ టన్నుల వివిద రకాల ఎరువులు అవసరం కాగా, కేవలం 30 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు మాత్రమే అందుబాటు లో ఉండడంతో రైతాంగంలో తీవ్ర ఆoదలోన నెలకొందని ఆయన ఆవేదన, ఆందోళన వ్యక్త పరిచారు. ఇప్పటి వరకు వివిధ రిజర్వాయర్లలో నీరు పుష్కలంగా ఉన్నా రైతాంగానికి ఎలా కేటాయించాలి? ఏ పైర్లు పెట్టాలి అనే దానిపై జిల్లా కలెక్టర్ ఆద్యర్యంలో కనీసం సమావేశం ఏర్పాటు చేయకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు.గండికోట రిజర్వాయర్ లో 26 టి.ఎం సి లకు గాను 19టి ఎంసి లు, బ్రహ్మాం సాగర్ లో 17.74 టి.ఎం సి లకు గాను 9.82 టిఎంసీలు నిల్వ ఉన్నాయని, వర్షాభావ పరిస్థి తుల్లో కె.సి. కెనాల్ కు ఎలా నీరివ్వాలనే దానిపై రైతాంగంలో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన దానిపై వ్యవసాయ శాఖ,ఇరిగేషన్ శాఖల ద్వారా తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటివరకు చర్యలు లేకపోవడం,ప్రణాళిక రూపొందించకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. రైతులకు కావలసిన ఎరువులు,విత్తనాలు, నీటి లభ్యతపై స్పష్టమైన ఆదేశాలు,కార్యాచరణ, ప్రణాళిక రూపొందించేందుకు తక్షణం వ్యవసాయ,ఉద్యన వన శాఖ, ఇరిగేషన్ శాఖ అధికారులతో జిల్లా సర్వోన్నతాధి కారి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశo ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.రైతులు సకాలంలో పంటలు పండించే విదంగా అధిక దిగుబడులు సాదించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన కార్యచరణ, ప్రణాళికను సిద్దంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వo లో రైతులకు పంటల బీమా అందని ద్రాక్షలా తయారైందన్నారు. వైఎస్. జగన్ సర్కారు లో ప్రతి ఏటా క్రమం తప్పకుండా పంటల బీమా ప్రీమియం చెల్లించి, రైతులకు పంటల బీమా పంటలవారిగా నేరుగా సంబందిత రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యేదని తద్వారా వ్యవసాయం పండగలా ఉండేదని ఆయన గుర్తుచేశారు. గత ఏడాది 2025 ఖరీప్ సీజన్ కు సంబందించి ప్రభుత్వ వాటా చెల్లించకపోవడంతో ప్రీమియం చెల్లించన రైతులకు బీమా అందే అవకాశాలే లేవని ఆయన ఆందోళన వ్యక్తపరిచారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం తనవాటాకు సంబందించి ప్రస్తత ఏడాదైనా ఇన్సూరెన్స్ కంపెనలకు ప్రీమియం చెల్లించి వివిద పంటల ద్వారా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే రైతాంగం ఉద్యమాలు తప్పవని రెడ్యం తీవ్రంగా హెచ్చరించారు.*

