ఖమ్మం ఆగష్టు 11
(పున్నమి న్యూస్)
ఖమ్మం నగరం లోని ఋగ్వేదం స్కూల్ కరెస్పాండెంట్ బొర్రా భాను ప్రకాష్ బీజేపీ పార్టీలో చేరారు. బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో, ఓబీసీ మోర్చా ఖమ్మం జిల్లా అధ్యక్షులు రేఖ సత్యనారాయణ యాదవ్ సారథ్యంలో ఆయన పార్టీలో చేరిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు భాను ప్రకాష్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణ, బీజేపీ సీనియర్ నాయకులు వేల్పుల సుధాకర్,ధనియాకుల వెంకట్ నారాయణ
అ నంత్ ఉపేందర్ గౌడ్‌తో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.



