వాసవి మాత ఆలయం వీధి లో ఉన్న ఉమామహేశ్వర ఆలయంలో జీవ ధ్వజస్తంభ ప్రతిష్టొపన మహోత్సవం వైభవంగా జరిగింది సోమవారం నుంచి వివిధ పూజలు, యాగాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తూ వచ్చిన క్రమంలో గురువారం అశేష భక్తజన శివనామ స్మరణ లతో నూతన ధ్వజస్తంభం ను విజయవంతం గా ప్రతిష్టించారు.ఆలయ నిర్వహణ బాధ్యత లను ఎన్నో ఏళ్లుగా నిర్వహిస్తున్న నేరేళ్ల జ్వాల రావు, తన శ్రీమతి అనుసూయమ్మ స్మారకం గా
నేరేళ్ల జ్వాల సుబ్రహ్మణ్యం ల, చంద్ర ఆధ్వర్యంలో నేరెళ్ల జ్వాల సుబ్బారావు, మహాలక్ష్మి ,జ్వాల ప్రసాద్ నాగసునీత దంపతుల సౌజన్యంతో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట వైభవంగా కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన యాగ శాలలో పలువురు దంపతులు పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా విశేష పూజల అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. నాలుగు రోజులుగా జరిగిన విశేష పూజలు విజయవంతంగా ముగియడం లో సహకరించిన భక్తులకు, ఆలయ కమిటీ సభ్యులకు యువ నేత నేరేళ్ల చంద్ర కృతజ్ఞతలు తెలిపారు.



