ఉదయగిరి ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ పుణ్యవతి కృష్ణా జిల్లా పామర్రుకు బదిలీపై వెళ్లారు. ఆమె స్థానంలో ఉదయగిరి ప్రాజెక్టుకు ఇన్ఛార్జి సీడీపీఓను జిల్లా సంబంధిత అధికారులు ఇప్పటివరకు నియమించలేదు. దీంతో ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ, పరిపాలనా వ్యవహారాలపై ప్రభావం పడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. సీడీపీఓ లేకపోవడంతో అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బంది ఎదుర్కొనే సమస్యల పరిష్కారంలో జాప్యం జరిగే అవకాశముంది. ప్రాజెక్టు పరిపాలన సజావుగా కొనసాగేందుకు అధికారులు తక్షణమే ఇన్ఛార్జి సీడీపీఓను నియమించాలని పలువురు కోరుతున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులు వెంటనే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

ఉదయగిరి ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ బదిలీ