Thursday, 24 September 2026
  • Home  
  • సమతుల్య ఆహారంతో పోషకాహార లోపానికి చెక్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సమతుల్య ఆహారంతో పోషకాహార లోపానికి చెక్

ఉదయగిరి: పోషకాహార లోపాన్ని నివారించేందుకు కుటుంబంలో ప్రతి ఒక్కరూ సమతుల్య ఆహారం తీసుకోవాలని అంగన్వాడీ కార్యకర్త చాంద్ బేగం సూచించారు. పోషణ్ మాసం సందర్భంగా ఉదయగిరి అంగన్వాడీ కేంద్రంలో బుధవారం పోషకాహార అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ప్రతిరోజూ ప్రోటీన్లు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలతో కూడిన పోషకాహారం అందించాలని తెలిపారు. పిల్లల ఎదుగుదలకు అవసరమైన పోషకాలు సమృద్ధిగా లభించేలా ఆహారంలో వైవిధ్యం పాటించాలని సూచించారు. పోషకాహారంపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు జబీన్, పోలమ్మ, సుజాత, సంజీవరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై పలు సూచనలు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.