బాసర ఆగస్టు 17(పున్నమి ప్రతినిధి )
నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు కల్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ పథకాన్ని కొనసాగించాలని కే సి ఆర్ నాయకత్వంలోని బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ పథకం పేదింటి ఆడబిడ్డల వివాహానికి వారి తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకూడదనే సదుద్దేశంతో అమలు చేయబడింది.
పేద కుటుంబాలకు అండగా నిలిచిన ఈ సంక్షేమ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను వెంటనే ఆపాలని, కల్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ పథకాన్ని నిరంతరాయంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బాసర మండల కేంద్ర కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా బాసర మండల అధ్యక్షులు శ్యామ్ కొర్వా ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి యం ఆర్ ఓ కీ వినతిపత్రం అందజేయడం జరిగింది.



